కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో నేనేం చేశానో అందరికీ తెలుసు: చిదంబరం

  • అంతిమంగా న్యాయమే గెలుస్తుందన్న నమ్మకం ఉంది
  • ఆర్థిక వ్యవస్థను బీజేపీ ప్రభుత్వం కుప్పకూల్చింది
  • ఆర్థిక పరిస్థితిపై మోదీ ఏనాడూ మాట్లాడలేదు
తాను కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఏం చేశానో అందరికీ తెలుసని, అంతిమంగా న్యాయమే గెలుస్తుందన్న నమ్మకం ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం చెప్పుకొచ్చారు. ఐన్‌ఎక్స్ మీడియా కేసులో చిదంబరానికి సుప్రీంకోర్టు బెయిలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

ఆర్థిక వ్యవస్థను ఎన్డీఏ ప్రభుత్వం కుప్పకూల్చిందని, ఆర్థిక పరిస్థితిపై ప్రధానమంత్రి మోదీ ఏనాడూ మాట్లాడలేదని చిదంబరం విమర్శించారు. దేశంలో ఉల్లి ధరలు పెరిగినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆయన అన్నారు. ప్రజలకు బీజేపీ నేతలు చాలా హామీలిచ్చారని, వాటి గురించి పట్టించుకోవట్లేదని ఆయన విమర్శలు గుప్పించారు.
Go Back to Shorts
chidambaram
Congress
BJP

More Telugu News